26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి

26-05-2026 04:52 PM

కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెం స్థానిక సమాచారం ప్రకారం బర్లి ఫీట్ ఏరియాలో తోట రాంబాబు రైస్ గ్రాండ్ నందు క్లీనర్ గా పనిచేస్తున్నాడు సోమవారం మధ్యాహ్నం 3:00గంటల సమయంలో పని పూర్తి చేసుకొని ఝాన్సీ హాస్పిటల్ దగ్గర గల తన నివాసం ఉండే రూమ్ కి వెళ్తున్న సమయంలో మెట్ల దగ్గర పడి ఉండగా, గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు, డాక్టర్ పరీక్షించి  ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

ఈ విషయం మంగళవారం  ఉదయం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయడంతో పోలీసు అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  కొత్తగూడెం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్  వెల్లడించారు. 

వివరాల ప్రకారం తోట రాంబాబు వయసు సుమారు (50 నుండి 55 సంవత్సరాలు), చామన చాయి రంగు, మెడలో జంధ్యం కలిగి మచిలీపట్నానికి చెందిన వ్యక్తిగా తెలుపడం జరిగింది. మృతుని గురించి ఏదైనా పూర్తి సమాచారం తెలిసినచో ఈ నెంబర్లకు తెలియజేయవలసిందిగా పోలీసులు కోరారు.  

8712682017 -IOP 

8712682020 -SI-2