ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై దాడి
- ఇరాన్ నేవీ విధ్వంసమే మా టార్గెట్
- ఇప్పటి వరకు 30 ఇరాన్ యుద్ధనౌకల నిర్వీర్యం
- ప్రకటించిన అమెరికా సెంట్రల్ కమాండ్
వాషింగ్టన్, మార్చి 6 : పశ్చిమాసియాలో వడగండ్లలా పెళపెళ బాంబులు పేలుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దృశ్యాలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఇరాన్ నేవీ మొత్తంగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పుడు ఇరాన్ డ్రోన్ యుద్ధనౌకను టార్గెట్ చేశామని, అది మంటల్లో కాలిపోతోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా యూఎస్ ముంచేసింది.
తాజాగా డ్రోన్ వాహక నౌకను ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు చెందిన 30 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అలాగే ఇరాన్ దేశంలోని 200 లక్ష్యలపై బాంబర్ ఫోర్స్ దాడి చేసినట్లు వెల్లడించింది. బీ బాంబర్లు భూగర్భ లక్ష్యాలపై బంకర్ బస్టర్లను వేసినట్లు పేర్కొంది. ఈ నౌక డ్రోన్ల కోసం 180 మీటర్ల రన్‌వేతోపాటు ఇంధనం నింపకుండా 22,000 నాటికల్ మైళ్ల పరిధి వరకు ప్రయాణించగలదు.




