28 June, 2026 | 3:49 PM

Breaking News

పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •  

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌పై దాడి

12-05-2026 12:00 AM
  1. ధ్రువీకరించిన హిజ్బుల్లా
  2. స్పందించని ఐడీఎఫ్ సైన్యం

జెరూసలేం, మే 11: ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఐరన్ డోమ్ బ్యాటరీపై ఇటీవల హిజ్బు ల్లా డ్రోన్ దాడి చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలను తాజాగా హిజ్బుల్లా సోషల్ మీడియాలో విడుదల చేసింది. గత వారం జరిగిన ఈ పేలుడు దాడిలో ఐరన్ డోమ్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొంది. లెబనాన్ సరిహద్దు సమీపంలోని వెస్ట్రన్ గలీలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిజ్బుల్లా ప్రసా రం చేసిన వీడియోలో ఒక డ్రోన్ వేగంగా ఐరన్ డోమ్ వైపు వెళ్లడం కనిపిస్తోంది.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఇజ్రాయెల్ సైనికులు ముప్పును గుర్తించలేకపోయారు. ఇ జ్రాయెల్ సైన్యం ఈ దాడి ప్రభావంపై ఇప్ప టి వరకు అధికారికంగా స్పందించలేదు. హిజ్బుల్లా తరచూ ఇలాంటి చిన్నపాటి ఎఫ్‌పీవీ డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి సిగ్నల్ జామింగ్‌కు చిక్కకుండా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సాయంతో పనిచేస్తాయి.

గత శుక్రవారం కూడా మౌంట్ మెరాన్ ప్రాంతంలో ని ఇజ్రాయెల్ వైమానిక నియంత్రణ కేం ద్రంపై డ్రోన్ల సమూహంతో దాడి చేసినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సరిహద్దు వెంబడి ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.