13 August, 2026 | 4:42 PM

జాకోరాలో మహిళా మండలి భవనం ప్రారంభం

13-08-2026 03:41 PM

బోధన్,(విజయక్రాంతి): వర్ని మండలంలోని జాకోరా గ్రామంలో మహిళా మండలి నూతన భవనాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే గ్రామాలు, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి, మరింతగా ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మహిళా మండలికి నూతన భవనం నిర్మించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో ఎం. విజయకుమారి, ఐకేపీ సిబ్బంది, స్థానిక తహసీల్దార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.