13 August, 2026 | 4:32 PM

నాందేడ్‌లో హైఅలర్ట్: సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి

13-08-2026 03:25 PM

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గురువారం దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. గురుద్వారా సమీపంలో బాదల్‌పై దాడి జరిగిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్చారని పోలీసులు తెలిపారు. తన కుడి చేతికి గుడ్డ చుట్టుకుని ఒక భవనం లోపల బాదల్ నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఒక వైరల్ వీడియోలో కనిపించింది. దాడిలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ తో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన మరిన్ని వివరాలు, అలాగే బాదల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.