11 May, 2026 | 4:30 PM

మాజీ సీఎం స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ.. తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం

11-05-2026 03:55 PM

తమిళనాడులో కొత్త సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్‌ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల తర్వాత వరుస భేటీలు కొనసాగుతున్నాయి.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(Chief Minister Joseph Vijay) సోమవారం నాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ను ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ స్టాలిన్‌ను కలవడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనను ఒక మర్యాదపూర్వక భేటీగా అభివర్ణిస్తున్నారు. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి విజయ్‌కు ఘన స్వాగతం పలికారు. 

 తమిళనాడు రాజకీయ వార్తలపై మరిన్ని అప్‌డేట్స్  విజయక్రాంతి న్యూస్ చదవండి

ముఖ్యమంత్రి రాగానే, ఉదయనిధి మొదట విజయ్‌కు కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా కౌగిలించుకుంటూ స్వాగతం పలికారు. ఆ తర్వాత, స్టాలిన్ కూడా విజయ్‌ను కౌగిలించుకున్నారు. విజయ్, స్టాలిన్‌లు ఒకరినొకరు పట్టు శాలువాలు, పూలగుచ్ఛాలతో సత్కరించుకున్నారు. ఏప్రిల్ 23 ఎన్నికలకు ముందు DMK, విజయ్ నేతృత్వంలోని TVK మధ్య జరిగిన తీవ్రమైన ఎన్నికల పోరు ఇందులో TVK(Tamilaga Vettri Kazhagam) విజయం సాధించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తమిళనాడులో జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే పార్టీ రికార్టు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే డీఎంకే, ఎండీఎంకే నేతలతో సమావేశమైన సీఎం విజయ్, సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు.

సీఎం విజయ్..  ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రి విజయ్, మరో తొమ్మిది మంది మంత్రులు, ఎడప్పాడి కె. పళనిస్వామి సహా మాజీ ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సోమవారం నాడు తమిళనాడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారని అధికారులు తెలిపారు. తాత్కాలిక సభాపతి ఎం. వి. కరుప్పయ్య వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొత్తగా ఏర్పాటైన తమిళనాడు శాసనసభలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ వరుస భేటీలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా నేషనల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి