30 June, 2026 | 10:09 AM

యువతి విషయం.. తాగేసి బీరు సీసాలతో కొట్టుకున్న స్నేహితులు

09-06-2025 08:43 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా(Medchal Malkajgiri) కుత్బుల్లాపూర్‌ మండలంలో పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. యువతి విషయంలో నలుగురు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. యువతి గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మాటా మాటా పెరిగి మద్యం మత్తులో బీరు సీసాలతో నలుగురు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీరుసీసాలతో దాడికి ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.