30 June, 2026 | 10:11 AM

వడ్డేపల్లి ఎంపీడీవోగా సుదర్శన్ బాధ్యతల స్వీకరణ

30-06-2026 08:56 AM

అలంపూర్: వనపర్తి జిల్లా కొత్తకోట మండల పంచాయతీ అధికారిగా (ఎంపీఓ) విధులు నిర్వహించిన సుదర్శన్ పదోన్నతిపై వడ్డేపల్లి మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ... మండల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.