కేజ్రీవాల్‌పై దాడికి ప్రయత్నం
లిక్విడ్ విసిరిన యువకుడు
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆగంతకుడు దాడికి యత్నించాడు. కేజ్రీవాల్‌పై లిక్విడ్ పోసేం దుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో అరవింద్ పాదయాత్ర చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా దాడికి యత్నించిన వ్యక్తిని ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
దాడికి ఉపయోగించిన లిక్విడ్ ఏమిటనేది స్పష్టత రాలేదు. ఘటనపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ‘బీజేపీ లీడర్లు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో ర్యాలీలు చేపడుతున్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరిపై దాడులు జరగలేదు. కానీ కేజ్రీవాల్‌పై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలు లోపించాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది’ అని ప్రశ్నించారు.






