10 July, 2026 | 2:38 PM

ఇజ్రాయెల్‌పైకి ఇరాక్ డ్రోన్లు

01-12-2024 03:41 AM

జెరూసలెం, నవంబర్ 30: హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన సయమంలోనే మరోవైపు కొందరు ముష్కరులు ఇరాక్ నుంచి ఇజ్రాయెల్‌పైకి దాడులకు పాల్పడ్డారు. ఇరాక్ వైపు నుంచి ఇజ్రాయెల్‌పైకి రెండు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఐడీఎఫ్ అధికారులు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని తమ నేవీ మిస్సైల్ బోటు సహాయంతో డ్రోన్లను తమ సైన్యం నేల కూల్చిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లు తూర్పు ప్రాంతం నుంచే వచ్చాయని, వాటిని ఇరాక్ ప్రయోగించింది అని చెప్పడానికి అదొక కోడ్ అని అధికారులు తెలిపారు. డ్రోన్లు వస్తున్న టైంలో ఎలాంటి సైరన్లు మోగలేదన్నారు.

ఇటీవల ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌వైపు దూసుకొచ్చిన అనుమానిత డ్రోన్‌ను ఇజ్రాయెల్ వైమానికి దళం కూల్చివేసిందని తెలిపారు. మరోవైపు హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి రావడంతో ఇన్నాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు తమ గ్రామాలకు తిరిగి వస్తున్నారు. అయితే యుద్ధం నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కాల్పుల విరమణ నివేదిక వచ్చేవరకు లెబనాన్ దక్షిణ భాగంలోని తమ సొంత గ్రామాలకు తిరిగి రావొద్దని ఐడీఎఫ్ సూచించింది. ఈ గ్రామాల నుంచి ఐడీఎఫ్ వైదొలగడానికి దాదాపు 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.