02-06-2025 06:43:19 PM
వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చెక్కపల్లి వేములవాడ అర్బన్ పరిధిలో సెక్టార్ పరిధిలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల నెలవారి సమీక్షా సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ... అంగన్వాడి అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పిల్లల్ని అంగన్వాడి పాఠశాలలో చేర్పించే విధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు సూపర్వైజర్లు సిడిపిఓ కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో సర్వే చేయడం అలాగే బడి బయట ఉన్న బడిడు పిల్లల్ని గుర్తించడం వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అలాగే పిల్లలలో శారీరకపరమైన మానసికపరమైన ఎదుగుదల లోపాలు ఏవైనా ఏర్పడినప్పుడు వాటిని గుర్తించడం వాటిని సవరించడం కోసం ఎర్లీ డిటెక్షన్ సంబంధించిన ప్రశ్నలని విద్యార్థులతో పరిశీలించాలని సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో మహిళ సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించకపోతే వారికి చైల్డ్ మ్యారేజ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారిని తప్పనిసరిగా గుర్తించి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వారికి అడ్మిషన్లు కల్పించాలని సూచించారు. వారి వివరాలు ఒకవేళ ఉన్నట్లయితే కార్యాలయానికి పంపిస్తే ఇట్టి విషయంలో సహకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నిర్మల అంజమ్మ పాల్గొన్నారు.