2 May, 2026 | 7:07 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్ మృత్యుంజయ్

12-03-2026 12:15 AM

కంటెంట్ కింగ్ శ్రీవిష్ణు, హుస్సేన్ షా కిరణ్ కాంబోలో తెరకెక్కిన ‘మృత్యుంజయ్’ చిత్రం మార్చి 6న థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం విజయవంతంగా దూసుకెళ్తోంది. గత వారం విడుదలైన చిత్రాల్లో ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ ‘మృత్యుంజయ్’ సత్తా చాటుకుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిన మృత్యుంజయ్ మౌత్ టాక్, రివ్యూలతో ప్రస్తుతం భారీ విజయంతో దూ సుకుపోతోంది.

లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సి నిమాలోని కథ, కథనం కొత్తగా ఉండటం, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియె న్స్ అందించడంతో ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్స్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో సినిమా నడుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, నేచురల్ స్టార్ నాని ఇచ్చిన రివ్యూ లు సైతం సినిమా విజయంలో భాగమయ్యాయి. పోటీలో ఎలాంటి పెద్ద హీరోల చిత్రం లేకపోవడం ‘మృత్యుంజయ్’కి మరింతగా కలిసి వచ్చింది.