23 June, 2026 | 3:51 PM

భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు

23-06-2026 02:34 PM

కోనరావుపేట, జూన్ 23 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని భూక్యారెడ్డితండా గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైరిస్క్ గ్రామాల ప్రజలకు ప్రత్యేక ఎక్స్‌రే పరీక్షల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మరియు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆంజిలిన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామంలోని హైరిస్క్ వర్గాలకు చెందిన 86 మందికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి, క్షయవ్యాధి లక్షణాల గుర్తింపుపై అవగాహన కల్పించారు.గ్రామాల్లో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వైద్య సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో భూక్యారెడ్డితండా సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్, హెచ్‌ఎస్ రషీద్, హెచ్‌ఏ సవైలాల్, టీబీ సూపర్వైజర్లు మహిపాల్, జేత్య (ఎస్‌టీఎస్), గంగాధర్, ఎక్స్‌రే టెక్నీషియన్ బాలు, ఏఎన్‌ఎంలు జ్యోతి, అశ్విని, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.