23 June, 2026 | 3:51 PM

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం

23-06-2026 02:46 PM

న్యూఢిల్లీ: తెలంగాణలో రికార్డు స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు(Grain Procurement) చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్ని కష్టాలు వచ్చినా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని లెక్క చెప్పారు. ఖరీఫ్, రబీ కలిపి 152 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు చేసి, రైతులకు దాదాపు రూ, 38 వేల కోట్ల మేర చెల్లింపులు చేశామని మంత్రి ఉత్తమ్ వివరించారు.

కేంద్ర లక్ష్యం 51 లక్షల టన్నులైతే.. తాము 80 లక్షల టన్నులు కొన్నామని వెల్లడించారు. మిగతా 29 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. యాసంగిలోనే రూ. 6,837 కోట్లు అదనంగా ప్రభుత్వం భారం భరించి కొనుగోళ్లు చేశామని పేర్కొన్నారు. భారీ ఎత్తున కొనుగోళ్లు దృష్ట్యా ఎఫ్ సీఐ ద్వారా కొనాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర నిబంధనల మేరకు 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.