2 May, 2026 | 8:50 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

7వ శతాబ్దపు కథలో సత్యవతిగా..

11-03-2026 01:29 AM

స్టార్ హీరో గోపీచంద్ ఇప్పుడు ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ‘గోపీచంద్33’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్‌కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్‌నకు మంచి స్పందన లభించింది. గోపిచంద్ ఈ సినిమాలో యోధుడిలా ఓ బలమైన పాత్రలో కనిపించనున్నట్టు ఆ వీడియో ద్వారా వెల్లడయింది. దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తెస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథానాయికను ప్రకటించారు మేకర్స్. ఇందులో గోపిచంద్ సరసన హీరోయిన్ రితూ వర్మ నటించనుంది.

మంగళవారం రితూ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రితూ పాత్రను ‘సత్యవతి’గా పరిచయం చేస్తూ పంచుకున్న పోస్టర్‌లో ఆమె లుక్ శక్తిమంతంగా, పాత్రకు తగ్గట్టు వైవిధ్యంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది వంటి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు మేకర్స్ తెలిపారు.

7వ శతాబ్దానికి చెందిన, చరిత్రలో పెద్దగా వెలుగులోకి రాని ఓ యధార్థ సంఘటన నేపథ్యంలో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్; డీవోపీ: సౌందర్ రాజన్; ఫైట్స్: వెంకట్, పృథ్వీ, రియల్ సతీశ్.