మాపై కేసులు పెడితే భయపడం
29-10-2024 02:06 PM
హైదరాబాద్: మాపై కేసులు పెడితే భయపడం.. రేవంత్ రెడ్డి వచ్చాక పాత పథకాలను ఆపేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సు నిర్వహించారు. రైతు ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలను ఆపేశారు.. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. రుణమాఫీ చేయలేదు.. నన్ను రాజీనామా చేయమంటున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు. రేషన్ కార్డులో ఒకరికే రుణమాఫీ చేస్తామని పెట్టారు.. కేసీఆర్ ప్రభుత్వంలో అందరికి రుణమాఫీ చేశారని గుర్తుచేశారు.




