18 April, 2026 | 11:37 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

విద్యార్థులు హాస్టల్‌కు చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

13-06-2025 01:54 AM

ఐటీడీఏపీఓ రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 12 (విజయ క్రాంతి)గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న పాఠశాలలు, వ సతి గృహాలు, పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ ప్రారంభమైనందున విద్యార్థినీ విద్యార్థులు సెలవులు ముగించుకొని అందరూ పాఠశాలలకు చేరుకునేలా సంబంధిత హెచ్‌ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రా హుల్ అన్నారు.

గురువారం కొత్తగూడెంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల కళాశాల, ఫ్రీ మెట్రిక్ పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలల్లోని హాస్టల్ గదులు డార్మెట్రీ, డైనింగ్ హాల్, బాత్రూమ్స్, వంటగది, వసతి గృహాలలోని పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వేసవి సెలవులు ముగించుకొని విద్యార్థినిలు అం దరూ వారి వారి పాఠశాలలకు వచ్చే విధంగా సంబంధిత హె చ్‌ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి తల్లిదండ్రులకు తెలియజేసి సోమవారం నాటికి 100% పిల్లలందరూ వారి ఇన్స్టిట్యూషన్ లో ఉండాలన్నారు.

పిల్లలు రాగానే వాతావర ణం మార్పు వలన అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉ న్నందున తప్పనిసరిగా పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలన్నారు. పరిసరాల చుట్టూ శుభ్రం చేయించాలని, డ్రైనేజీలు, బాత్రూములు, అన్ని శుభ్రంగా ఉంచి పిల్లలకు సురక్షితమైన మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని, నూతన మెనూ ప్రకారం తప్పనిసరిగా వారికి ఆహారం అందించాలన్నారు.

వ సతి గృహాలు చాలా పురాతనంగా ఉన్నందున ఏమైనా రిపే ర్లు ఉంటే వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి తనకు సమర్పించాలన్నారు. విద్యార్థినిలకు మాత్రము ఎటువంటి ఇబ్బం దులు కలగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత వార్డెన్ పై ఉందని, వారం రోజులు పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతుల ను సంబంధిత ఏఎన్‌ఎంలు గమనిస్తూ ఉండాలన్నారు.

ఎవరైనా అస్వస్థత గురి అయితే వెంటనే వైద్య పరీక్షలు చేయిం చాలన్నారు. అనంతరం విద్యార్థినిలతో మాట్లాడుతూ వేసవి సెలవులకు సొంత ఊర్లకు వెళ్లి వచ్చినందున ప్రస్తుతం వాతావరణం మార్పు వలన అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వార్డెన్ కు తెలియజేయాలని,

చదువు పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో మీరు ఏమి కాదల్చుకున్నారో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధి కారిని మణెమ్మ, పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ కృష్ణవేణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.