డివైడర్‌ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి
27-04-2026 02:11 AM
సదాశివపేట, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): సదాశివపేట మండలం నందికంది సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం ది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్యాల్క ల్ మండలానికి చెందిన లావణ్య, మనూర్ మండలానికి చెందిన రుక్మిణి, అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






