అంవెండి తెర దాల రాశి!
మాలా సిన్హా.. అసలు పేరు ఆల్డా సిన్హా. అందం, అభినయంతో వెండితెరపై మెస్మరైజ్ చేసిన అందాల రాశి. 1950 మధ్య బాలీవుడ్‌ను ఏలిన సూపర్ స్టార్స్‌లో మాలా సిన్హా ఒకరు. 40 సంవత్సరాలు వందకుపైగా
సినిమాలు, అందులో ఎన్నో హిట్లు! అప్పట్లో అందానికి, ప్రతిభకు నిదర్శనంగా ఉండేవారు. ఫిల్మ్‌ఫేర్ నుంచి ఉత్తమనటిగా ఆమెకు ఎన్నో అవార్డ్స్ వరించాయి. 2018లో ఉత్తమనటిగా ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు’, అలాగే ధూల్ కా ఫూల్, బహురాణి, జహాన్ అరా, హిమాలయ్‌కీ గోద్ వంటి సినిమాల్లో వరుసగా ఉత్తమనటి అవార్డులను అందుకున్నారు.
నేపాల్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చిన క్రిస్టియన్ ఫ్యామిలీ వారిది. బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ‘జై వైష్ణోదేవి, రోషనార, ధూళి’ వంటి బెంగాలీ సినిమాల్లో నటించినప్పుడు ఆమె పేరుని ‘బేబీ నజ్మా’గా మార్చారు. ఆమె గొప్ప గాయని, నర్తకి కూడా. ఆకాశవాణి ధ్రువపత్రం పొందిన గాయనీమణుల్లో ఆమె ఒకరు. మాలా సిన్హా నిజానికి నటి అవ్వాలనుకోలేదు. గాయని అవ్వాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి లతా మంగేష్కర్ పాటలను అనుకరించేవారు. అందరూ ఆమెని ‘బేబీ లతా’ అని పిలిచేవారు. దుర్గా పూజలప్పుడు, పుట్టినరోజు వేడుకల్లో మాలా చేత పాటలు పాడించేవారు.
ఫిల్మ్‌ఫేర్‌లో మొదటిసారి మాలా సిన్హా ఫోటో చూసిన ప్రముఖ దర్శకుడు అమియ చక్రవర్తి, ఆమెను బొంబాయికి పిలిపించి మూడు సినిమాల కోసం ఒప్పందం చేసుకున్నారు. అయితే తొలి సినిమా ‘బాద్ షా’ (1954) ఫ్లాప్ కావడంతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. తర్వాత రెండు సినిమాలు కిషోర్ సాహు గారి హామ్లెట్ (1954), ఏకాదశి (1955) కూడా విఫలమయ్యాయి. బొంబాయ్ నుంచి కలకత్తా వెళ్ళిపోదామనుకున్న సమయంలో నటుడు జానకీదాస్ వాళ్ళ ఫ్యామిలీని కలిశారు. అప్పట్లో దర్శకులు లేఖ్జ్ భక్రి ‘నయా జమానా’ అనే సినిమా తీస్తున్నారు.
మాలా సిన్హా నటించిన ‘హామ్లెట్’ చూడమని జానకీదాస్ ఆయనని ఒత్తిడి చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా మాలా సిన్హాకి మంచిపేరే వచ్చింది. “నేనా సినిమాలో ఓఫెలియా పాత్ర పోషించాను. అప్పట్లో నేను బక్కపలచని టీనేజర్‌ను. కిషోర్ సాహుగారి శ్రీమతి నాకు పాడెడ్ కాస్ట్యూమ్స్, విగ్స్ పెట్టారు” అని చెప్పి నవ్వారట మాలాసిన్హా. ఆ నిర్మాతలు ‘హామ్లెట్’ చూసి ‘నయా జమానా’ కోసం మాలా సిన్హాతో ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజుల్లో నిర్మాత ఎస్.ముఖర్జీ దుర్గా పూజను నిర్వహించేవారు.
ఆ ఉత్సవంలో పాడేందుకు మాలా సిన్హాకు ఆహ్వానం అందింది. ఆ సమయంలోనే గాయని గీతాదత్ భర్త గురుదత్ మాలా సిన్హాను ఒక నాటకంలో నటించమని కోరారు. ఆ నాటకంలో మాలా సిన్హా నటన నచ్చిన గురుదత్ ‘ప్యాసా’ (1957) సినిమాలో ఆమెను తీసుకున్నారు. ఆ మూవీలో ఆమె నటనకు ఎంతగానో పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి.
‘మైతఘర్’ (1966) అనే నేపాలీ సినిమాలో నటించేందుకు ఖాట్మాండ్ వెళ్ళాల్సి వచ్చింది. మంచు కప్పిన పర్వతాల వెనుక అత్యంత విలువైనది తానేదో వదిలేసి వస్తానని ఆమెకి ఆస మయంలో ఏ మాత్రం తెలియదు. అది ఆమె హృదయం! అవును, అక్కడ ఆమె తన కాబో యే భర్త, చిదంబర్ ప్రసాద్ లొహానిని కలిశా రు. ఆ సినిమాలో చిదంబర్ ఆమెకు సహనటుడు (ఆయన కస్టమ్స్‌లో పని చేసేవారు. కానీ అందంగా ఉన్నారని ఈ సినిమాలో ఒక పాత్రలో నటించేందుకు అవకాశమిచ్చారు). సినిమా షూటింగ్ పూర్తు, కొన్ని రోజులకు మాలా బొంబాయి వచ్చేశారు.
కానీ సి.పి. లొహాని హృదయంలో మాత్రం మాలా నిలిచిపోయారు. కొన్ని నెలల తర్వాత లొహాని గారికి మాలా సిన్హా నుంచి ఓ ఉత్తరం అందిందట. చిదంబర్ పేరు అప్పటికే నేపాల్ అంతటా మార్మోగింది. మాలా పట్ల ఆయనకీ అంతే ప్రేమ. తర్వాత నుంచి వాళ్ళిద్దరూ తరచుగా కలుస్తూ, తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని 1966లో వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె ప్రతిభ సిన్హా ప్రస్తుతం బెంగాలీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమె ఆఖరి సినిమా ‘జిద్’. 1987లో తండ్రి చనిపోయినప్పుడే సినిమాలు ఆపేసి ఆధ్యాత్మికం వైపు వెళ్లారు. వృత్తి జీవితాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ వేరువేరుగా ఉంచగలిగిన ధీశాలి మాలా సిన్హా.






