ఏండ్రియాల వాసికి అవార్డు
08-05-2026 12:43 AM
తాడ్వాయి, మే, 7( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామానికి చెందిన శ్రావణ లక్ష్మి రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శాఖ గ్రామీణ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ గా శ్రావణ లక్ష్మి విధులు నిర్వహిస్తోంది.
హైదరాబాదులో నిర్వహించిన డే ఎన్ ఆర్ ఎల్ ఎం ఎస్ హెచ్ జి బ్యాంకు లింకేజీ ప్రోగ్రాంలో 2025- 26 కార్యక్రమంలో పి ఆర్ అండ్ ఆర్ డి ఆర్ డబ్ల్యు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రాన్ని అవార్డును అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది.ఈ సందర్భంగా ఏండ్రియాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






