1 July, 2026 | 11:12 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నీటి కాసులపై అవగాహన

06-03-2026 08:36 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజల్లో కంటి ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కాసులు (గ్లాకోమా) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాలేజ్ ప్రిన్సిపాల్ ఐ.పద్మలత, వైస్ ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జ్ ఈ.పద్మ ఆధ్వర్యంలో నిర్వహించగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.ప్రవీణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ అనంతుల్లా విజయ హాజరై మాట్లాడారు.

నీటి కాసులు వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రారంభ దశలోనే లక్షణాలను గుర్తించడం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం అని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా నీటి కాసుల లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ పద్ధతుల గురించి ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే శాశ్వత దృష్టి లోపాన్ని నివారించవచ్చని వైద్యులు సూచించారు. ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.