7 March, 2026 | 7:43 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

06-03-2026 08:26 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): అధిక డోసులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మందులు విక్రయించే మెడికల్ షాప్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు. మండలంలోని పొనుగోడు గ్రామంలో శుక్రవారం శ్రీరామా మెడికల్ జనరల్ స్టోర్ పై అధికారులు ఆకస్మిక తనక్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్ లో నిలవన్న ఔషధాలను, పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.

డాక్టర్ రిసెప్షన్ లేకుండా అధిక డోసులను, చిన్నపిల్లలకు సంబంధించి దగ్గు సిరప్పులు విక్రయించరాదని తెలిపారు. చిన్నపిల్లలకు సంబంధించి దగ్గు సిరప్ విక్రయించరాదని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లాభాల కోసం ప్రమాదకరమైన మందులు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే మందులను విక్రయించడం తీవ్రమైన నేరమని ఆయన అన్నారు.

అధిక డోసులు అనుమతులు లేని మందులు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని మందులు నిషేధిత కల్తీ రసాయనాలు విక్రయించే మెడికల్ షాపులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మండలంలో ఇకపై మెడికల్ షాపులపై తరచు తనిఖీలు నిర్వహిస్తామని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.