18 May, 2026 | 3:42 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

18-05-2026 02:37 PM

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మండలం లోని కోసర గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మమేకమై ఆధునిక సాగు పద్ధతులు, సహజ వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డా. ఎన్. మహేష్ మాట్లాడుతూ యూరియా వినియోగంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అధిక సాంద్రత పత్తి సాగు (HDPS) విధానం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. 

పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశాలపై సూచనలు చేశారు.డా. జి. ప్రియా సుగంధి సహజ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. రసాయన రహిత సాగు విధానాలు పాటించడం వల్ల భూమి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి  రాము, ఎఫ్‌పీఓ సీఈఓ, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.