1 July, 2026 | 11:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్లాస్టిక్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన

17-03-2026 12:00 AM

మేడ్చల్, మార్చి 16 (విజయ క్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేడ్చల్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని రిషి యు బి ఆర్ ఉమెన్స్ కాలేజీలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. పర్యావరణ ఇంజనీర్ బి రాజేందర్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానికారిక ప్రభావాలను వివరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల భూమి, నీరు, జీవ వ్యవస్థలకు కలిగే నష్టాలను విద్యార్థులకు తెలియజేశారు.

అంతేకాకుండా నిత్యజీవితంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి పాటించాల్సిన నియమాలు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి వివరించారు. సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు సైతం తమ అభిప్రాయాలను పెంచారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. సింగిల్ యూస్ నిషేధంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు భార్గవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.