యుద్దోన్మాదం నశించాలి.. శాంతి చేకూరాలి
చేవెళ్ళ మార్చి 16(విజయక్రాంతి): చేవెళ్ల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో యుద్దొన్మాదం నశించాలి పెట్రోల్ ధరల అరికట్టి గ్యాస్ కొరతను అరికట్టాలని సిపిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేవెళ్ల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ కె రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎం ప్రభు లింగం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి పెట్రోల్ డీజిల్ ధరలు అరికట్టాలని గ్యాస్ కొరత నివారించాలన్నారు. ప్రపంచ శాంతి కాపాడాలని యుద్ధం నశించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టాల్ జిల్లా అధ్యక్షుడు ఎండి మద్బుల్ మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల సిపిఐ నాయకులు పెంటయ్య మహిళా సంఘం నాయకురాలు జయమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.




