26 June, 2026 | 1:47 AM

సుస్థిర వ్యవసాయంపై అధ్యాపకులకు అవగాహన

26-06-2026 12:22 AM

ఘట్ కేసర్, జూన్ 25 (విజయక్రాంతి): వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జీవ ఎరువులు, జీవ పురుగు మందుల పాత్రపై అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు.

ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాంట్ పాథాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రేయ్ బోధనకర్ (కన్వీనర్), ప్లాంట్ ఫిజియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. స్టీఫెన్ (కో-కన్వీనర్ ) వ్యవహరించారు.

అగ్రానమీ, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, ప్లాంట్ ఫిజియాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, లైవ్ స్టాక్ డిపార్ట్మెంట్, బయోకెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు విశ్వవిద్యాలయ యాజమాన్యం, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ పి. నారాయణ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులను పాల్గొన్నవారు అభినందించారు.