4 May, 2026 | 9:36 PM

వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహన‌

04-05-2026 08:03 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా  మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి  రైతు వేదికతోపాటు ఆయా రైతు వేదికల్లో సోమవారం “రైతు వారోత్సవం” కార్యక్రమాన్ని ఏవో అనితారెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్  సుధాక‌ర్ రెడ్డి, ఏడీఏ స‌త్య‌నారాయ‌ణ పాల్గొని  రైతులకు నేల ఆరోగ్యం కాపాడుకోవడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, పచ్చి ఎరువుల సాగు చేయడం గురించి సూచనలు  చేశారు. 

ఈ సంద‌ర్భంగా   వారు మాట్లాడుతూ వ్య‌వ‌సాయంపై త‌ప్ప‌ని స‌రిగా రైతులు వ్వవ‌సాయ శాఖ అధికారుల సూచ‌న మేర‌కు  పంట‌లు వేసుకోవాల‌ని సూచించారు.  నాణ్య‌మైన విత్త‌నాలు వేసి అధిక దిగుబ‌డులు సాధించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో  మాజీ ఎంపీపీ రాంరెడ్డి,  పీఏసీఎస్ మాజీ చైర్మ‌న్ విజ‌య్ కుమార్,  ఏఈఓ త‌దిత‌రులు పాల్గొన్నారు.