పార్టీ కోసం కష్టపడే నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
పిల్లుట్ల రఘు
గరిడేపల్లి, జూన్ 26: పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని బిఆర్‌ఎస్ నాయకులు పిల్లుట్ల రఘు అన్నారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన గంగానగర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నట్టె సైదయ్యను పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల హుజూర్నగర్ లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రాయినిగూడెం సమీపంలో విజయ చందర్ రైస్ మిల్ కు చెందిన రేకులతో కూడిన ఇనప ఫ్రేమ్ లు కాళ్లపై పడి తన రెండు కాళ్లు విరగడం బాధాకరం అన్నారు. ఈ ఘటనతో ఆయన పడుతున్న బాధ వర్ణనాతీతమన్నారు.
ఈయన వెంట గుగులోతు కృష్ణ నాయక్, గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, రాపోల్ నవీన్, బానావత్ జగన్, వీరంరెడ్డి శంబిరెడ్డి, బొల్లెపల్లి రామనాథం గౌడ్, బచ్చలకూరి శ్రీనివాస్, బి. సుధీర్, నకరికంటి సుధా నాగరాజు, నాగిరెడ్డి, కుక్కునూరు అంజయ్య, బెక్కం విజయ్ కుమార్, మండవ నాగేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు.






