29 August, 2026 | 3:07 PM

అనురాగ్ యూనివర్సిటీలో బీబీఏ 6వ బ్యాచ్ ఓరియంటేషన్ కార్యక్రమం

29-08-2026 02:35 PM

ఘట్ కేసర్, ఆగస్టు 29(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో బీబీఏ 6వ బ్యాచ్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. 2026–27 విద్యా సంవత్సరంలో బీబీఏలో మొత్తం 185 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు యూనివర్సిటీ విద్యా విధానం, క్రమశిక్షణ, పరీక్షలు, ప్లేస్‌మెంట్‌లు, అంతర్జాతీయ అవకాశాలు, విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. డాక్టర్ వి. విష్ణు వందన, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, విద్యార్థులకు విద్యా నిబంధనలు, క్రమశిక్షణ, ప్రవర్తనా నియమావళి గురించి వివరించారు.

ప్లేస్‌మెంట్ డైరెక్టర్ సిద్ధార్థ ఘోష్ మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉద్యోగ, కెరీర్ అవకాశాలను వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ అంకితా టుటేజా, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్చనా మంత్రి, డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ అనురాగ్ పల్లా, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎం. ముత్తారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డాక్టర్ బాలాజీ ఉట్ల ప్రసంగించారు.