జాతీయ విద్యా విధానంపై అవగాహన
ఎన్‌ఈపీ 6వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమ నిర్వహణ
ఇబ్రహీంపట్నం, జూలై 29(విజయక్రాంతి): సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీ రింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్‌ఐఈటీ), ఇబ్రహీంపట్నంలోని ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) ఆధ్వర్యంలో జాతీయ వి ద్యా విధానం(ఎన్‌ఈపీ 2020) 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన సదస్సు బుధవారం కళాశాల సెమినార్ హా ల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శేఖర్ బాబు ము ఖ్య వక్తగా పాల్గొని జాతీయ విద్యా విధానం 2020 ముఖ్య లక్ష్యాలు, విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విద్యార్థి కేంద్రిత బోధన, నైపుణ్యాభివృద్ధి, బహుళశాఖల విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పరిశోధన ఆధారిత అభ్యాసం వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు.
భారతదేశాన్ని జ్ఞా న ఆధారిత సమాజంగా తీర్చిదిద్దడంలో ఎన్‌ఈపీ 2020 కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రతిభలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాలను ఈ విధానం కల్పిస్తోందన్నారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అభివృద్ధి చేయడంలో ఎన్‌ఈపీ 2020 దోహదపడుతుందని వివరించారు.
అకాడమిక్ డీన్లు డాక్టర్ భరణి సేతుపాండియన్, డాక్టర్ రాకేష్,అధ్యాపకులు, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొని జాతీయ విద్యా విధానం అమలు ద్వారా ఉ న్నత విద్యలో కలిగే మార్పులు, అవకాశాల గురించి అవగాహన పొందారు. కార్యక్రమం డైరెక్టర్ జి. భాగత్, సెక్రటరీ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఐఐసీ కోఆర్డినేటర్ డాక్టర్ కందె శ్రీనివాస్ కార్యక్రమాన్ని సమన్వయం చేసి, జాతీయ విద్యా విధానం లక్ష్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ విద్యా విధానం 2020 పట్ల మరింత అవగాహన పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.






