23 August, 2026 | 6:52 PM

Breaking News

నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి   •  

చైల్ సేఫ్టీ వీక్‌లో దత్తతపై అవగాహన

01-05-2026 12:10 AM

మొయినాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మొయినాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో చైల్ సేఫ్టీ వీక్ కార్యక్రమంలో భాగంగా చట్టబద్ధ దత్తత ప్రక్రియ, అనధికార దత్తత వల్ల కలిగే ప్రమాదాలు, రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో సంధ్యా, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ జబీనా బేగం, ఏసీడీపీవో హర్షవర్ధని పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలను దత్తత తీసుకునే వారు తప్పనిసరిగా CARA నిబంధనలను పాటించాలని సూచించారు.

బంధువుల ద్వారా లేదా డబ్బులు చెల్లించి అనధికారంగా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.పిల్లలను కొనడం, అమ్మడం లేదా వారి ప్రయోజనాల కోసం ఉపయోగించడం వంటి చర్యలకు కఠినమైన కారాగార శిక్షలు ఉంటాయని తెలిపారు. దత్తత కోరుకునే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన శిశు గృహాల ద్వారా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, కౌన్సిలర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పాలన అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.