1 May, 2026 | 2:07 AM

గిరిజన సంస్కృతిని కాపాడుకుందాం

01-05-2026 12:10 AM

అనాథ బిడ్డలకు అండగా నిలుద్దాం: కలెక్టర్ రాజర్షిషా

ఉట్నూర్, ఏప్రిల్ 30( విజయ క్రాంతి): గిరిజన ఆర్థిక వ్యవస్థలో ఇప్ప పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం జామిడి గ్రామంలో జరిగిన 9వ ఇప్ప పువ్వు పండుగ, అనాథ పిల్లల సంక్షేమ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన ఆర్థిక వ్యవస్థలో ఇప్ప పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని, దీనిని శాస్త్రీయ పద్ధతిలో సేకరించి విక్రయించడం ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇటువంటి ఉత్సవాలు గిరిజన సంస్కృతిని భావితరాలకు అందిస్తాయని పేర్కొంటూ, ఐటిడిఎ ద్వారా రైతులకు, స్వ యం సహాయక సంఘాలకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. 

అనంతరం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా మాట్లాడారు. అనంత రం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డి.సి.పి.యు సర్వే‘ చట్టబద్ధమైన దత్తత - ఫోస్టర్ కేర్‘ అవగాహనకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. 

అలాగే ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో కొలం గిరిజన మహిళలు వెదురు తో తయారు చేస్తున్న కళాకృతులను  బయట ప్రపంచానికి పరిచయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని నాడ్డుం గూడ కొలం గిరిజన మహిళలు వెదురు తో తయారుచేసే కళాకృతులను పరిశీలించారు.