కామారెడ్డిలో సైబర్ నేరాలపై అవగాహన
కామారెడ్డి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): సైబర్ నేరాల పై కామారెడ్డి లో జరుగుతున్న కేపీఎల్ మ్యాచ్ క్రీడాకారులకు మంగళవారం కామారెడ్డి పోలీసులు అవగాహన కల్పించారు. సైబర్ భద్రతపై సూచనలు, 1930 హెల్ప్ లైన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులు యువతను ఆన్లైన్ మోసాలు అప్పట్లో చైతన్య పరచడమే ప్రధానంగా లక్ష్యంగా అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఎస్‌ఐ నరేష్, సైబర్ నేరగాలని అనుసరిస్తున్న వెన్నుతున్న ఆధునిక మోసం కూడా పద్ధతుల గురించి క్రీడాకారులకు వివరించారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమింగ్ స్కామ్లు, ఇన్స్టంట్ లోన్ యాప్ ల వల్ల కలిగే ప్రమాదాలు, సోషల్ మీడియా మోసాలు, సైబర్ స్టాకింగ్, పార్ట్ టైం జాబ్స్ పేరిట జరిగే పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
తెలియని వ్యక్తులు నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ ను డౌన్లోడ్ చేయడం ద్వారా మొబైల్ డాటా చివరికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆన్లైన్ ఫ్లాట్ ఫారంలను వినియోగించే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుండి వచ్చే సందేశాలు లింకులను ధ్రువీకరించకుండా స్పందించవద్దని అధికారులు సూచించారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయకూడదని స్పష్టం చేశారు.
అనుమానస్పద కాల్స్ లేదా ఆఫర్లకు దూరంగా ఉండడం ద్వారా మోసాలను నివారించవచ్చని తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 19 30 కి కాల్ చేయాలని, సంబంధిత వ్బుసైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
సైబర్ భద్రతపై సూచనలు 1930 హెల్ప్లైన్ వినియోగించండి
కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కామారెడ్డి ప్రీమియర్ లీగ్ (KPL) క్రీడా వేదికగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులు మరియు యువతను ఆన్లైన్ మోసాల పట్ల చైతన్యపరచడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. జిల్లా సైబర్ క్రైమ్ విభాగం (ౄ4C) ఎస్త్స్ర శ్రీ నరేష్ గారు కార్యక్రమాన్ని నిర్వహించి, సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వినూత్న మరియు ఆధునిక మోసపూరిత పద్ధతుల గురించి ఆటగాళ్లకు వివరించారు.
ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమింగ్ స్కామ్లు, ఇన్స్టంట్ లోన్ యాప్ల వల్ల కలిగే ప్రమాదాలు, అలాగే సోషల్ మీడియా మోసాలు, సైబర్ స్టాకింగ్, పార్ట్టైమ్ జాబ్స్ పేరిట జరిగే పెట్టుబడి మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్‘ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే APK ఫైల్స్ను డౌన్లోడ్ చేయడం ద్వారా మొబైల్ డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను వినియోగించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చే సందేశాలు, లింక్లను ధృవీకరించకుండా స్పందించవద్దని అధికారులు సూచించారు.
వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీ (OTP)లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయకూడదని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ లేదా ఆఫర్లకు దూరంగా ఉండటం ద్వారా మోసాలను నివారించవచ్చని తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా సంబంధిత వ్బుసైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఎస్త్స్ర నరేష్ , పీసీ ప్రవీణ్ పాల్గొని క్రీడాకారుల సందేహాలను నివృత్తి చేశారు.




