27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

నీటి సమస్యపై తలసాని ఆగ్రహం

08-04-2026 12:32 AM

పరిష్కారం కాకపోతే ఆందోళన

సనత్‌నగర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి):- ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపో యిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

అమీర్ పేట డివిజన్ లోని బిజేఆర్ నగర్, బిజెజెఆర్ నగర్, బల్కంపేట, ఎస్సార్ నగర్ లలో నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నామని ఆయా ప్రాంతాల ప్రజలు ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్‌ను కలిసి విన్నవించారు. దీంతో మం గళవారం ఆయన అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లో ఏ ఒక్క రోజు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పారు. కానీ గత 10 రోజుల నుండి త్రాగునీరు సరఫరా కావడం లేదని, నీటికోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. సమస్య లు పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి తానే ప్రత్యక్ష ఆందోళన చేపడతానని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సుజాత, మహేష్, వాటర్ వరక్స్ జీఎం సతీష్, శానిటేషన్ వెంకటేష్, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు హన్మంతరావు, ప్రవీణ్‌రెడ్డి, కూతురు నర్సిం హ, కట్టా బలరాం, కరుణాకర్ రెడ్డి, గుడిగే శ్రీనివాస్ యాదవ్, రాజేష్ ముదిరాజ్, వనం శ్రీనివాస్, నాయకులు పీయూష్ గుప్తా, గౌతమ్, లలితా చౌహన్, గోపీలాల్ చౌహన్, వినోద్, హరిసింగ్ తదితరులు ఉన్నారు.