calender_icon.png 5 February, 2026 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

04-02-2026 01:00:07 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి3 (విజయ క్రాంతి): జంట నగరాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు హైడ్రా అవగాహన కార్యక్రమాలు పలు ప్రాంతాల్లో నిర్వహించింది. ఇటీవలే నాంపల్లి లోని ఫర్నీచర్ షోరూంలో అగ్ని ప్రమాదంతో పాటు నగరంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలో నగర ప్రజలను అప్రమత్తం చేయడానికి చర్యలు చేపట్టింది. పలు షాపింగ్ మాల్స్ ఫైర్సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైన అన్ని హైడ్రా గుర్తించింది.

ఫైర్ సేఫ్టీ నిబంధనలు తూచా తప్పకుండా పా టించేందుకు నెల రోజులు గడువు ఇస్తూనే, అవగాహన కార్యక్రమాలను కూడా హైడ్రా చేపట్టింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగితే ఎలా మంటలను అదుపులోకి తీసుకురావాలి ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించే విధానాలను హైడ్రా అధికా రులు తెలియజేస్తూఫైర్ ఎక్ట్సింగ్విషర్లు విని యోగించడం, మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే వాటర్ స్ప్రింక్లర్ల పనితీరు, స్మోక్ డిటెక్టర్లపై నగరంలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

కార్మికులు, వ్యాపారులు ఎలా భద్రంగా ఎలా బయట పడాలో సూచి స్తూ, షాపులలో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను గుర్తించడంతో పాటు. వంటలు అంటుకున్న వెంటనే అగ్ని మాపక శాఖ 101, హైడ్రా కంట్రోల్ రూమ్ 1070, 9000113667 కు ఫోను చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ కార్యక్రమాలు నిర్వహించారు. హైడ్రా ఉన్నతాధికారులు, షాప్ యజ మానులు, సిబ్బంది పాల్గొన్నారు.