13 August, 2026 | 9:15 PM

ప్రపంచ అవయవ దాన దినోత్సవంపై అవగాహన

13-08-2026 07:37 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా వికాస్‌లో లయన్స్ క్లబ్, ప్రపంచ అవయవ దాన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఆర్డిఓ ఎం.విజయకూమరి ముఖ్య అతిథిగా హాజరై, అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతి సమక్షంలో అవయవ దానాల ప్రాముఖ్యతపై విద్యార్థులు, ప్రముఖులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

అవయవ దానం ద్వారా మరణానంతరం కూడా పలువురికి పునర్జన్మనిచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలు అవయవ దానంపై ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లతో పాటు సావిత్రిబాయి ఫూలే వార్షిక కాలమానాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ బసవేశ్వరరావు, ప్రముఖులు కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖుల సమక్షంలో ఆర్డీవో ఏం.విజయ కుమారి కు కాట్రగడ్డ భారతి  లయన్స్ క్లబ్ ట్రస్ట్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు.