13 August, 2026 | 9:57 PM

మహా ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాడి రాజయ్య

13-08-2026 09:00 PM

మహా ముత్తారం,(విజయక్రాంతి): మహా ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాడి రాజయ్య  గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ  తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి మంథని నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శీను బాబులకు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్లీ ఎగిరేలా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. పట్టణ అధ్యక్షులుగా నియామకం పట్ల కాంగ్రెస్  పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ జాడి రాజయ్యకు  అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.