కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పొంగులేటి యూత్ కాంగ్రెస్
అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి: యాసా శ్రీకాంత్
కల్లూరు,(విజయక్రాంతి): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కల్లూరు మండల పొంగులేటి యూత్ కాంగ్రెస్ నాయకులు, 15వ వార్డు కౌన్సిలర్ యాసా నాగమణి శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా యాసా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఒక నాయకుడిపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వయస్సులో పెద్దలను గౌరవించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని, ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు కష్టకాలంలో అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయం చేసే నాయకుడిగా పొంగులేటికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందన్నారు.గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని తెలిపారు.
కౌశిక్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ముందుగా దృష్టి సారించాలని హితవు పలికారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కౌశిక్‌రెడ్డి సమయం, తేదీ ప్రకటిస్తే యువజన కాంగ్రెస్ తరఫున చర్చకు వస్తామని సవాల్ చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయంగా దీటైన సమాధానం ఇస్తామని యాసా శ్రీకాంత్ హెచ్చరించారు.






