17 March, 2026 | 9:21 PM

జీనేక్స్ సీడ్స్ వారి టాపర్ మొక్కజొన్న పంటపై రైతులకు అవగాహన

17-03-2026 07:59 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని మర్కోడు గ్రామ పరిధిలో గల జిన్నెలగూడెం గ్రామంలో కొర్స మల్లయ్య అనే రైతు జినేక్స్ సీడ్స్ వారి టాపర్ మొక్కజొన్న పంటను మంగళవారం క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ టాపర్ మొక్కజొన్న కంకులు పొడవుగా లావుగా బలమైన గింజలతో ఉన్నాయని దీనివల్ల అధిక దిగుబడి వస్తుందని అందరు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.

కష్టపడి సాగుచేసిన మొక్కజొన్న పంటకు అధిక దిగుబడి వచ్చినప్పుడే రైతులకు అసలైన ఆనందం లభిస్తుందని కంపెనీ యజమాన్యం శ్రీపాల్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 500మంది రైతులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు టాపర్ మొక్కజొన్న పంట వేసి అధిక దిగుబడి సాధించామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

టాపర్ రకం మొక్కజొన్న పంట పండించిన రైతు మల్లయ్య దంపతులను స్థానిక గ్రామీణ డీలర్ వెలిశాల కార్తీక్, అనుమోల వెంకటేశ్వరరావు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో  మర్కోడు గ్రామపంచాయతీ సర్పంచ్ సుతారి రమాదేవి, పడిగ సమ్మయ్య, కంపెనీ సిబ్బంది బానోత్ జితేందర్,రాయుడు, రఘు,రాకేష్,రైతులు తదితరులు పాల్గొన్నారు.