17 April, 2026 | 1:52 PM

Breaking News

రామేశ్వర్‌పల్లిలో కుష్టు నివారణపై అవగాహన సదస్సు

04-02-2026 07:29 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం వద్ద కుష్టు వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా సరైన అవగాహన, చికిత్స అందించి గ్రామాన్ని కుష్టురహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, సర్పంచ్ చేపూరి రాణి రాజు, వివిధ ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.