అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలపై అవగాహన
04-08-2026 12:00 AM
అయిజ, ఆగస్టు 3: అయిజ మున్సిపాలిటీలోని బలిజపేట కాలనీలోని అంగన్వాడి కేం ద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం ప్రమీలమ్మ మాట్లాడుతూ, శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలని, తల్లిపాలు సంపూర్ణ పోషకా హారంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.






