4 August, 2026 | 1:51 AM

జిట్స్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

04-08-2026 12:00 AM

కరీంనగర్, ఆగస్టు 3, 2026: జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల విని యోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈగిల్ ఫోర్స్, ఆర్‌ఎన్సీసీ కరీంనగర్ డి.ఎస్.పి ఎస్ ఉపేందర్, ఎల్‌ఎండీ సిఐ బి రమేష్, యాంటీ నార్కోటిక్ సెల్ ఇన్స్పెక్టర్ ఎం.డి. రఫీఖ్ ఖాన్, తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్‌ఐ భారతి, ఎల్‌ఎండీ ఎస్త్స్ర సయ్యద్ అన్వర్, ఎస్త్స్ర ఆర్‌ఎన్సీసీ జి రమేష్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి పూర్తిగా దూరంగా ఉండి ఆరో గ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జె సాగర్ రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జె సుమిత్, డీన్ అకాడెమిక్స్, ఆడిట్ డాక్టర్ పి కె వైశాలి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి ప్ర ణీత, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.