స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు, గోరింటాకు పండగ
నేరేడుచర్ల ఆగస్టు 3 : నేరేడుచర్ల పట్టణంలోని న్యూ అరబిందో డిగ్రీ కళాశాల స్పందన జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా సోమవారం బోనాలు, గోరింటాకు పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డిలు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన తెలంగాణలో బోనాల పండుగ విశిష్టతను తెలియజేయడానికి సహ పాఠ్య కార్యక్రమలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు విద్యార్థులు సంప్రదాయ బద్ధంగా బోనాలను ఎత్తుకొని ఆటపాటలతో నిర్వహించిన సంబరాలు, ఆషాడ మాసం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న మెహేంది కార్యక్రమం పలువురిని అలరించింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎడవల్లి వెంకటరెడ్డి కరస్పాండెంట్ కట్ట ప్రవీణ్ కుమార్ రెడ్డి కళాశాల అధ్యాపకులు ఆంజనేయులు, సైదిరెడ్డి వెంకటేశ్వర్లు శ్రీనివాసచారి,నాగ ప్రసాద్ సతీష్, ప్రభాకర్, బాలకృష్ణ, నగేష్ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు కొప్పుల లింగారెడ్డి ఇండ్ల శ్రీధర్, కట్టనలిని,సింధు, రేణుక సుజాత పాల్గొన్నారు.






