17 July, 2026 | 12:39 AM

బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలకు ఓటర్ జాబితా అవగాహన సదస్సు

17-07-2026 12:39 AM

మెట్ పల్లి, జులై 16 (విజయక్రాంతి): పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్లో కోరుట్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు కోసం ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్,మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ హాజరై బి ఎల్ ఏ లకు మార్గదర్శనం చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతతో నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హమైన నమోదులు, డూప్లికేట్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు వంటి అంశాలను చట్టబద్ధంగా గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అధ్యయనం చేసి, ఎలాంటి పొరపాట్లు జరగకుండా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ బి ఎల్ ఏ లు, నాయకులు,ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.