16-10-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, అక్టోబర్ 15(విజయక్రాంతి): పత్తి కొనుగోళ్ల కు సంబంధించి సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ గురించి జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కు సంబంధించి వరి ధాన్యం, పత్తి కొనుగోళ్ల మద్దతు ధరలను తెలిపే గోడ ప్రతులను మంగళ వారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల లో కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మిల్లుల వద్ద పత్తి రైతులు నిరీక్షించే పరిస్థితి ఉండదని తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు వారం రోజుల లోపు ఎప్పుడైనా పత్తిని మిల్లులకు తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చని ఆమె చెప్పారు. జిల్లాలో ఈ సారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి బాలామణి, సివిల్ సప్లై డీఎం. రవి నాయక్, డిఎస్‌ఓ గంప శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.