17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రభుత్వ ప్రకటనపై హర్షం

21-02-2026 07:50 PM

భైంసా,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని వారి సేవలను గుర్తించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది అన్నారు. ఉద్యమకారులకు ప్రభుత్వ పెన్షన్ ఇవ్వాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చినందున వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.