calender_icon.png 17 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ పీపీ పుట్టపాగ రఘుపతికి డాక్టరేట్

16-10-2025 12:00:00 AM

మహబూబ్ నగర్ టౌన్,అక్టోబర్ 15: సమాజంలో పేద ప్రజలకు చేసిన సేవలకు గుర్తించి పుట్టపాగ రఘుపతి మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరవ డాక్టర్ పట్టాను పట్టా అందుకున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ ఇండియా వేదికలో వెల్ ఎడ్యుకేషన్ పీస్ కౌన్సిల్ ఆఫ్ న్యూఢిల్లీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆధ్వర్యంలో ఆయనకు డాక్టరేట్ ను అందజేశారు.

పేద ప్రజలకు రైల్వే స్టేషన్ బస్టాండులలో భిక్షాటన చేసే వాళ్లకు స్వచ్ఛందంగా అన్నదానం పలు సేవా కార్యక్రమాలు , పేద విద్యార్థుల చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయడంలో అవార్డు లభించింది కూడా గ్రామం నుంచి న్యాయవాదిగా అంచలంచలుగా ఎదుగుతూ జిల్లా కోర్టులో 25 సంవత్సరాల నుండి న్యాయవాదిగా సేవలందిస్తున్నారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నాలుగు సార్లు రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి ద్వారా ఉత్తమ సేవా ప్రశంస పత్రాలు అందుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కోర్టు నందు చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ గా పనిచేసి పేద ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందజేశారు. శ్రేయోభిలాషులు న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.