16-10-2025 12:00:00 AM
గండీడ్, అక్టోబర్ 15: రాజస్థాన్ ఉదయపూర్ లో నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ కల్చరల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ లో మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎంపిక కాబడి కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ పర్యావరణ, చారిత్రక కట్టడాల పరిరక్షణ మీద నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా జిల్లా నుండి జిల్లా పరిషత్ జెడ్పిహెచ్‌ఎస్ బాలుర గండేడ్ మండల కేంద్రం పాఠశాలలో సాటిక సుజాత ఎస్సే బయోసైన్స్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర పర్యటన, ప్రాజెక్టు వర్క్, ఆయా రాష్ట్రానికి సంబంధించిన బోనాలు పండుగ మరియు బతుకమ్మ పండుగ నిర్మాణ కళ రూపం ప్రదర్శనను ఈ రోజు సి.సి.ఆర్టి ఉదయపూర్ రాజస్థాన్ లో ప్రదర్శించారు.
తెలంగాణ రాష్ట్ర తరపున మొత్తం ఏడుగురు ఉపాధ్యాయుల బృందం ప్రదర్శించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వికారాబాద్ జిల్లా నుండి వి శివరాజు, ని జాంబాద్ నుండి కుమారస్వామి, రమేష్, సుజాత , సోహన్లాల్, సంతోష్ పాల్గొన్నారు.