14 August, 2026 | 8:15 PM

Breaking News

స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •  

పెరిగిన యాక్సిస్ బ్యాంక్ లాభం

17-01-2025 01:46 AM

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్వల్పంగా 4 శాతం పెరిగి రూ. 6,304 కోట్లకు చేరింది. గత క్యూ3లో బ్యాంక్ రూ. 6,071 కోట్ల స్టాండెలోన్ లాభాన్ని నమోదుచేసింది. తాజాగా ముగిసిన క్యూ3లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 33,516 కోట్ల నుంచి రూ. 36,926 కోట్లకు చేరింది.

నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధిచెంది రూ. 12,532 కోట్ల నుంచి రూ. 13,606 కోట్లకు పెరిగింది. 3.93 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించింది. స్థూల మొండి బకాయిలు 1.58 శాతం నుంచి 1.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.36 శాతం నుంచి 0.35శాతానికి తగ్గినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.