14 August, 2026 | 8:37 PM

Breaking News

ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం   •   సరస్వతి నగర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన   •   మిఠాయి భండార్ తయారీ యూనిట్‌పై ఎస్ఓటి దాడి   •   రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అండగా నిలవాలి   •   80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •  

ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

14-08-2026 08:03 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దీపక్ ముండే ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి వార్డు సభ్యుల జిల్లా కన్వీనర్ గులాం జావిద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాం జావిద్ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.నూతన కార్యవర్గం:

మండల అధ్యక్షుడిగా చిట్ల నారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చందన్‌ఖేడే సంతోష్, ఉపాధ్యక్షులుగా పుదరి జ్యోతి, గజ్జల భీమన్న, కార్యదర్శిగా కొట్రంగి పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా మరిశెట్టి ప్రేమ్ సాగర్, కోశాధికారిగా భీమంకర్ పశర్మ, అధికార ప్రతినిధిగా మామిడి లక్ష్మి ఎన్నికయ్యారు.కార్యనిర్వాహక సభ్యులుగా అత్రం అనిల్ కుమార్, అడే మల్లేష్, గేడెకర్ విలాస్, కథ్లే సీతారాంలను ఎన్నుకున్నారు. ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నూతన కార్యవర్గం నిరంతరం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.